పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0336-02 కేదారగౌళ సం: 04-209 వైరాగ్య చింత

పల్లవి :

{{Telugu poem|type=చ. 1:|lines=<poem>


పల్లవి :

ఇందిరానాథుఁడవు యిందరికి నేలికవు
చిందరవందరలైన చింతలు మరేలా


చ. 1:

వుండుమంటే నుండవీ వూరకే బ్రహ్మాండాలు
నిండుమంటే నిండినవి నీరధులెల్లా
మెండగుప్రతాపమిదె మించి నీ వినోదమిదె
వొండుదైవాలఁ గొలువ నూరకే మరేలా


చ. 2:

పుట్టుమంటేఁ బుట్టిరి పూఁచినదేవతలెల్ల
అట్టే యణఁగిరిగా అసురలెల్ల
పట్టిన నీచల మిదె బహళ స్వతంత్ర మిదె
వెట్టిదైవాలపనులు వేరే మరేలా


చ. 3:

కమ్మంటే నాయను కైవల్యపదవులు
రమ్మంటే వచ్చె వేదరాసులెల్లను
కమ్మిన శ్రీవేంకటాద్రి కడపరాయఁడ నీకు
యిమ్ముల నీమహి మిదె యితరములేలా