పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0322-06 సామంతం సం:04-129 వైరాగ్య చింత


పల్లవి :

దినమట రాతిరట తీరుచున్నదా
కవగూడఁ బాయఁ గాక కాణాచి వున్నదా


చ. 1:

మానుష జన్మమట మలమూత్రదేహమట
సోనల హేయమేకాక శుద్ధి వున్నదా
మానని కోరికలట మాయల సంసారమట
దీనవృత్తేకాక యిందుఁ దేజమున్నదా


చ. 2:

చంచలపుఁ జిత్తమట సకలేంద్రియములట
పొంచిన పాపమేకాక పుణ్యమున్నదా
సంచితపుఁ గర్మమట జనన లయములట
ముంచిన తీదీపేకాక మోదమున్నదా


చ. 3:

శ్రీవేంకటేశుఁడట జీవుఁడనేనట యిందు
దైవపుదాస్యమే కా కితరమున్నదా
యీవల నావలన ట యిహముఁ బరమునట
కైవశము లాయఁగాక కడమున్నదా