పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0322-02 గుండక్రియ సం: 04-125 విష్ణు కీర్తనం


పల్లవి :

హరి పరతత్వంబగుటకు గురి యిది
నరుల మితఁడే యని నమ్మితిమిదివో


చ. 1:

కవగూడిన భూకాంతుఁ దలఁచిపో
దివి వెలుఁగందిరి దేవతలు
జవమున రఘపతి శరణని మని రిదె
భువి విభీషణాది పుణ్యులు


చ. 2:

శ్రీతరుణీపతి సేవనే చెలఁగిరి
పాతాళాధిపబలిముఖలు
భాతిగా వైకుంఠభక్తినే బ్రదికిరి
ఘాతల ననంత గరుడాదులు


చ. 3:

శ్రీవేంకటపతి చింతనే పొదలిరి
సోవ ముక్తిగల శుకాదులు
వావిరి నీతని వరముల వెలసెను
తోవలఁ బరుష సందోహములు