పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు:0322-01 నారాయణి సం: 04-124 శరణాగతి


పల్లవి :

అన్నిటి పై నున్నట్లు హరిపై నుండదు మతి
కన్నులఁ బ్రహ్మదువలె కనుఁగొను టరుదా


చ. 1:

పులుగు నర్చించొకఁడు పూఁచెనాగతమెరిగి
వెలసి ఘనుఁడనంటా విఱ్ఱవీఁగీని
జలజాక్షుపాదములు సారె నర్చించేటివారు
ఇలలోనఁ బరమార్థ మెరుఁగుటయరుదా


చ. 2:

మానివోడ నమ్మొకఁడు మహాజలధి దాఁటి
నానార్థములు గూర్చి నటియించీని
శ్రీనాథుపాదములు చేకోనినమ్మినవాఁడు
పూని భవవార్థి దాఁటి పుణ్యమందు టరుదా


చ. 3:

దీపమువట్టి యొకఁడు తెగనిచీఁకటిఁ బాసి
చూపులనిన్నిటిఁ గని సుఖమందీని
చేపట్టి పరంజ్యోతి శ్రీవేంకటేశుభక్తుఁ-
డోపి ముక్తి కడగని వున్నతుఁడౌ టరుదా