పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0266-5 మంగళకౌశిక సం: 09-095

పల్లవి:

సొరిది నీ జాడ లెల్లఁ జూచుట గాక
యెరవు సతము లెంచ నిఁక నేల విభుఁడా

చ. 1:

నీవే నే నైతే నిలుచుందువా ఆడ
వోవరి నామీఁద నొరగుందువు గాక
పూవే పిందైతే పూఁప లనే మాఁట లేల
చేవదీరి శమువలెఁ జెప్పి చూపుఁ గాకా

చ. 2:

తమకమే కలిగితే దవ్వుల మాటాడుదువా
అమరి నాతో నేకత మాడుదు గాక
కమలమే కలువైతేఁ గడరేయి మొగుచునా
సమమై కాంచనముల జాడ నుండుఁ గాక

చ. 3:

చిత్తము లేకము లైతేఁ జేతి కిత్తువా విడెము
పొత్తుల మోవినె అంది యిత్తువు గాక
యిత్తల శ్రీవెంకటేశ యిటు గూడిన నీ పొందు
హత్తి పాలునీరువలె నైక్యమాయఁ గాక