పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0266-4 శుద్దవంతం సం: 09-094

పల్లవి:

తిట్టనేర్తునా నిన్ను దీవించ నేరుతుఁ గాక
దిట్టనై నీకు మోహించు తెరవ నేఁ గాక

చ. 1:

కోరి నీ వేమి సేసినఁ గోపగించ నేరుతునా
నేరుపునఁ జెక్కు నొక్క నేరుతుఁ గాక
సారె నిన్ను వెంగెమాడి జరయఁగ నేరుతునా
ఆరీతినె నిన్నుఁ గొనియాడ నేర్తుఁ గాక

చ. 2:

చీకాకుమై చూచి వుదాసీనము సేయ నేర్తునా
నీకు నేఁ బ్రియము చెప్ప నేరుతుఁ గాక
ఆకడ నీనిట్టూర్పుల కదే మన నేర్తునా
దీకొని నీ యల పెల్లఁ దీర్చ నేర్తుఁ గాక

చ. 3:

కామించి మొక్కఁగ నిన్నుఁ గాల దొబ్బ నేరుతునా
నేమమునఁ గాఁగిలించ నేరుతుఁ గాక
గోమున శ్రీవెంకటేశ కూడితివి బాస సేసి
యీ మేలు మరవ నే నెంతైన నేర్తునా