పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0266-2 పాడి సం: 09-092

పల్లవి:

ఇందుకేమి దోసమా యింతలోనిపని కేమి
కందుఁ గుందు నేరుపుచేఁ గప్పి పోయఁ బో

చ. 1:

చక్కని నీ వదనము చందరునికంటె మేలు
ముక్క పోయినది నీ మోవి యింతె పో
మిక్కిలి నీతురుమిది మేఘముకంటె మేలు
చిక్కువడి జారివది సిగ్గువాటి పో

చ. 2:

నిచ్చలు నీ దేహ మిది నీలముకంటె మేలు
పచ్చియై వున్నది నీ భావ మింతె పో
తచ్చిన నీ కరములు తామెరకంటె మేలు
కొచ్చి దయలేనిది నీ కొనగోరె పో

చ. 3:

పమ్మిన నీ కాఁగిలిది పానుపు కంటె మేలు
వుమ్మచెమటలఁ దోఁగె వుర మింతె పో
యెమ్మెల శ్రీ వెంకటేశ యిన్నిటా నీవు మేలు
చిమ్మి చిక్కించేది నీ చెలువమె పో