పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0265-4 సాళంగనాట సం: 09-088

పల్లవి:

ఎటువంటి మోహమో యెట్టి సంతసములో
ఘటియించె నిద్దరికిఁ గందువ మాయెదుటా

చ. 1:

కామిని యెదురు చూడగఁ గన్నుల పండుగలాయ
ఆమని నీ రాకల మోహనరూపము
వేమరు నాలకించఁగా వీనుల పండుగలాయ
కోమలితో నీ వాడే గురిమాటలు

చ. 2:

మానినికి నింతలోనె మంచి వుట్ల పండు గాయ
ఆనెటి నీ మించు నధరామృతము
తానకమాయ నిదిగో తగు దివ్వెల పండుగ
పాని నీ కరుణఁ జూచే పచ్చి చూపులు

చ. 3:

కలికికి నిపు డిట్టె కాఁగిటి పండుగ లాయ
చలువ నీ కూటముల సమరతులు
అలరి శ్రీ వెంకటేశ అన్నిటాఁ బండుగ లాయ
జలజాక్షి నీలోని సరసములు