పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0265-2 భైరవి సం: 09-086

పల్లవి:

ఆడనుండె యేమి గల్లా నానతియ్యరా
జాడతో నలుక గాదు చాలించరా

చ. 1:

చిగురాకు నామోవి చిత్తజు నడిద మట
తెగుఁజేసు నీ వంత దిష్టించకురా
పగటు నాకుచములు పాయని జక్కవ లట
యెగరుఁజేసు నీ వింత దగ్గరకురా

చ. 2:

నల్లని నాయారు యిది నంజువంటి పామట
చెల్లఁబో యేమౌనో మమ్ముఁ జేరకురా
వెల్లవిరి నా నడుము వింత మేఁటి సింహ మట
కల్లరి యేమి సేసునో కాఁగిలించకురా

చ. 3:

గరిమల నామేను కనకమువంటి దింతే
కరఁగజేసు నిట్టూర్పు గమ్మనీకురా
సిరుల శ్రీ వెంకటిశ చేరి కూడితి వింక
తరగు మొరఁగు దీరె దవ్వె చేరువరా