పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0264-5 ముఖారి సం: 09-084

పల్లవి:

వేగుదాఁకా జాగరాల వేసారితిమి
వాగపు బిత్తరికాఁడ వచ్చేవొ రావొ

చ. 1:

తళుకున మోము చూపి తల దీసే వంతలోనే
తొలుత నీ చేఁతల సుద్దులే తవ్వేవు
చలపట్టి వూరకైన సారె సారె నవ్వేవు
వలవంత సటకాఁడ వచ్చేవొ రావొ

చ. 2:

పొడవులు చూపేవు పొంచి పగ చాటేవు
యెడసితే వెదకేవు యింతలోనే
బడి బడి నీడుగానిపనులకే పెనఁగేవు
వడఁబెట్టి సటకాఁడ వచ్చేవొరావో

చ. 3:

బుద్దులఁ బోయేవు మెట్టి బూములెల్లాఁ దిరిగేవు
పొద్దువొద్దునకు నన్నుఁ బొదిగేవు
అద్దిర శ్రీవెంకటేశ అలమి కూడితి విట్టె
వద్దనుండి యిట్లనె వచ్చేవొ రావో