పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0264-4 బౌళి సం: 09-082

పల్లవి:

సరికి బేసి కవె పగ సాధించుఁ గాని
పరగ నందుకు నవె పతిమాఁటు చూపు

చ. 1:

వెన్నెలలె యెండ లట విరులె వాఁడెట
యెన్నఁగ నిందుకుఁగా నేల వెరవ
అన్నువ వెన్నెలరేని కారను రాహువుఁ జూ పు
విన్ననై విరులకును విరహాగ్నిఁ జూపు

చ. 2:

చిగురులే చేగ లట చిత్తజుఁడే పగ లట
యెగసక్కెముల నిందు కేల వెరవ
గుగురుఁ జిగురునకు కుత్తికె కోవిలఁ జూపు
షొగరుఁజంద్రపుమోము పున్నమమారుకుఁ జూపు

చ. 3:

గాలియె వేఁడట జక్కవ లుద్దీపన మట
యేల వెరవ శ్రీవెంకటేశుఁడు గూడె
గాలికిఁ జనుఁగొండలు కమ్మర నడ్డము చూపు
నాలి జక్కవలకు నీ నవ్వువెన్నెల చూపు