పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0264-2 సామంతం సం: 09-080

పల్లవి:

అతనిదెస చూచి నిన్నపుడు దూరితి మమ్మ
వెతదీర నిఁకనైన విచ్చేయ వమ్మా

చ. 1:

వుదయచందురుఁ జూచి వువిద నీ మో మనుచు
అదనరావైతివని యలిగి యవ్వలిమో మాయ విభుఁడు
యెదిటి మేఘముఁ జూచి యిదియె నీతురు మనుచు
కొదలుచును తల వంచి కొసరె నిన్ను

చ. 2:

చిలుకపలుకులు నీదుపలుకులని యిందాఁక
యెలయించి తనిగొణఁగియెడసి వీనులు మూసుకొనియుండెను
తళుకునను మెరువ నంతట నీదుచూపులని
తెలియనిభ్రమల దోమతెరలోని కేఁగె

చ. 3:

కోవిలలరొదలు విని కొమ్మ నీ యెలుఁ గనుచు
భావజుచేఁ బరచితని పదరి నినువేవేలు మాటలాడె
యీవేళ విచ్చేసి యిటు నీవు గలయఁగా
శ్రీవెంకటేశ్వరుఁడు చిక్కెరఁగఁ డాయ