పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0263-5 లలిత సం: 09-077

పల్లవి:

మదనరాగము నీకు మదనాతురము నాకు
యెదు రెదురఁ గలిగె నిందుకే మెచ్చితిఁ బో

చ. 1:

నిలువుల చెమటల నీమేను చూచినా
నిలువెల్ల జెమరించె నేఁ డిదివో
కలువ కన్నుల నీ కావి చూచి నా కన్నుఁ
గలువలు కావి దేరీఁ గాఁకల కోపమునా

చ. 2:

వేఁడి నిట్టూరుపుల నీ వేషము చూచి నాకు
వేఁడినిట్టూర్పులు రేఁగె వెల్లవిరి
వాడుదేరెకళల నీ వదనము చూచి నేఁడు
వాడుదేరి చిన్నఁబోయ వదనము నాకు

చ. 3:

యెవ్వతో కాఁగిటి నీ యీ మేనిపచ్చి చూచి
యివ్వల నీ కాఁగిలి నీ కెక్కె నిపుడు
రవ్వల శ్రీ వెంకటేశ రతుల సంగడి నిట్టె
నివ్వటిల్ల నిన్నంటి నీయంత నైతి