పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0263-4 ముఖారి సం: 09-076

పల్లవి:

ఏమే యిందు కెగ్గు లెంచఁ దగునా
కాముఁడు సేసినయట్టి కత లింతె కాక

చ. 1:

నేనా తనతో నెమ్మిఁ గొసరేదాన తన్నుఁ
గానక యెదురుచూచె కన్నులు గాకా
కానీ కానిమ్మని కడుఁ బగ చాటితినా
వూని జంకించినవె బొమ్మలింతె కాకా

చ. 2:

అలిగి తనతో నే నవ్వలిమో మౌదునా
చెలఁగి వంచినది నా సిరసె కాక
మలసి తనతోను మాటలాడ కుందునా
వెలసిన విరహపు పింతె కాక

చ. 3:

పట్టఁగా నేనా పైకొనకుండేదాన
గుట్టుతోడ నుండెటి నా గుణము గాక
యిట్టె శ్రీ వెంకటేశుఁ డిన్నిటాను నన్నుఁ గూడె
పట్టిన నా నోము ఫల మింతె కాకా