పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0263-1 రామక్రియ సం: 09-073

పల్లవి:

చెల్లెఁ జెల్లె నీవు సేసె చేఁత లెల్లాను నీ
పల్లదా లిన్నియు బండిబాటాయఁ దగవు

చ. 1:

కద్దు గద్దు నీ మాట కల్ల లేదు పొల్ల లేదు
వద్దు వద్దు నీతోడి వాదులు నాకు
ముద్దు ముద్దు సేసి నిన్ను మోవఁ బెంచె మీ తల్లి
పొద్దు వొద్దుఁ గోమటిండ్లపొరుగాయ బదుకు

చ. 2:

ఆయ‌ నాయ నీ మాట లల్లములు బెల్లములు
మూయ మూయ నీకె మూరెఁడు నోరు
తోయఁ దోయఁ దల్లి వెన్నతోడఁ బెట్టె ముచ్చిములు
పోయఁ బోయ గొల్లదోమటాయఁ బో మా పెరుగు

చ. 3:

వింటి వింటి నిన్ననె నీవేసాల బాసలును
కంటిఁ గంటి నిఁక నేల కైకొంటివి
యింట నింట శ్రీ వెంకటేశ పంతమిచ్చి నన్ను
నంటి యంటి నిచ్చకొత్తలాయఁ బో నా మనువు