పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0262-6 శుద్దవసంతం సం: 09-072

పల్లవి:

చాలుఁజాలు నాతో జాణతనాలా
చాలుకొన్న నీచూపు జళిపించ నేలరా

చ. 1:

పలుకవె చెలియ పచ్చిగా నదె రోరి
పలుకు నీ కప్పురపు బరణి నదె
నిలువవె కొంతవడి నే వచ్చినందాఁక
నిలువు నీ నామమందె నిక్కమాయ నదెరా

చ. 2:

అడిగేనె యింతి అప్పటి ని న్నొక సుద్ది
అడుగులు నీయందునవె కదరా
ముడికారి సట లేలె ముదితా
ముడి నీ సిరసునఁ గొమ్ముడి యిదె కదరా

చ. 3:

కలసితిఁ గదె నిన్నుఁ గలికి నీవు
కలగంపపతి వౌతఁ గంటిరా నేను
అలరి ని న్నురమున నానితిఁ గదె నిన్ను
నల శ్రీ వెంకటగిరి యానెఁ గదరా