పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0262-4 శ్రీరాగం సం: 09-070

పల్లవి:

ఒకటి కొకటి నుండఁ జెలిభావ మిది
మొకమెదుటనె నన్ను మోవ వ్రాసెనే

చ. 1:

పొలిఁతికురులు వ్రాయఁబోతేఁ దుమ్మిదలాయ
తలఁగకుండఁగ మోముఁదమ్మి వ్రాసెనే
కలికికన్నులు వ్రాయ గండుమీలై పొడచూపె
చెలపచెమట నీటిచెక్కులు వ్రాసెనే

చ. 2:

సరిఁ గుచములు వ్రాయ జక్కవలై పొడచూపె
నిరుదెస బాహులత లిటు వ్రాసెనే
గరిమ నడుము వ్రాయఁగా సింహమై తోఁచె
వరుసఁ దొడల యంటివనము వ్రాసెనే

చ. 3:

కోమలిపాదాలు వ్రాయఁ గూర్మములై పొడచూపె
ఆమని జవ్వనపులోఁ తటు వ్రాసెనే
యీమేర శ్రీ వెంకటేశఁ డే ననుచుఁ గూడె
రామ యిట్టె యిదివో నా రతి వ్రాసెనే