పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0262-3 సామంతం సం: 09-069

పల్లవి:

అప్పటి కప్పటి మాట లంతె చాలు
యిప్పుడు కాలు దాఁకించ నేల మొక్క నేల

చ. 1:

కూరవండి కసవేరె గుణము లోలో నేల
యేరా నిన్నుఁగూడి పాసె యెగపోఁ తేలా
నీరువట్టుగొని యిట్టె నెయ్యైనాఁ దెమ్మన నేల
సారె నీవు రానప్పటి చలిమందు లేలా

చ. 2:

జాగరము సేయనేల సరిగా నిద్రించ నేల
వేడి నే వేఁగినందుకు వెంట రా నేల
యీగతి నడుసు చొర నేల కడుగఁగనేల
భోగించి నీకు నేపొద్దు బుద్ది చెప్పనేల

చ. 3:

ఆకడఁ బంతము లేల అట్టె పందతన మేల
చేకొని గో రంటనేల సిగ్గువడ నేల
మేకుల శ్రీ వెంకటేశ మేలు నన్ను భ్రమయించి
పైకొని కూడితి వింక బా సడుగ నేల