పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0262-2 భైరవి సం: 09-068

పల్లవి:

ఆపాటి కాపాటి అందుకేమె
యీపని సరికి సరి యిందు కేమె

చ. 1:

యిదె తన మోవిఁగెంపు లెక్కఁ జూచి నా కన్నుల
కదనఁ గెంపు లెక్కె నందు కేమె
చెదరెఁ గురులు దననుదిటి పై నా చిత్త
మెదుటనె చెదరెఁ బో యిందు కేమె

చ. 2:

వన్నెలఁ దా ముడిచినవాడుఁ బువ్వు లటు చూచి
అన్నువ నా మోము వాడె నందుకేమె
పన్ని చిట్లుగందాల భావము చూచి నా మాట
లిన్నియుఁ జిటులు మనీ నిందు కేమె

చ. 3:

సేయఁగల వెల్లఁ జేసి చేరి నన్నుఁ గూడఁగాను
ఆయెడ నేనుఁ గూడితి నందు కేమె
పాయపు శ్రీ వెంకటపతి మేను నామేను
యీయెడ నేకము లాయ నిందు కేమె