పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0262-1 ముఖారి సం: 09-067

పల్లవి:

అతివ నీ సింగార మట్టిదెకా అందుమీఁద
పతివిరహము నైతె భావించ వసమా

చ. 1:

తామెరపైఁ దుమ్మిదలు దట్టమై మూఁగుండఁగాను
నేమముగ నది చూచి నీ విభుఁడు
కోమలి నీ విప్పు డిట్టె కుత్తికబంటి జలాన
ఆముక యీఁదులాడే వని తానూ దుమికె

చ. 2:

మించు జక్కవలు తీఁగెమీఁద వాలి వుండఁగాను
అంచెల నీరమణుఁడు అది చూచి
వుంచానఁ బయ్యద జార నొగి విరులు గోసెటి
చంచని తా లేచి వచ్చి సరిఁ గాఁగిలించెను

చ. 3:

నిక్కి మేడలోన నొక్క నెమలి నటించఁ జూచి
అక్కడ శ్రీ వెంకటేశుఁ డది నీ వని
అక్కరతో దగ్గరఁగా నంతలోన నీవు వచ్చి
పక్కనఁ గూడఁగ దనభ్రమలెల్లఁ బాసెను