పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0261-3 ముఖారి సం: 09-063

పల్లవి:

ఇంక నేల వేగిరము యింతలోని పనికిఁగా
తెంకి నే పానుపుమీఁద దిద్దుకొనేఁ గాని

చ. 1:

అంతనీవు దగ్గరకు ఆయములు సోఁకీని
పంతపు మాటాడకుర పచ్చి రేఁగీని
కొంత నీవు నవ్వకురా గుండె గడు ఝల్లురనీ
మంతనాన నీ పగటు మందలించేఁ గాని

చ. 2:

తప్పక చూడకురా తనువెల్లఁ బులకించీ
చిప్పిలఁ బెనఁగకురా చెమరించీని
కప్పకుర పచ్చడము కడు సిగ్గు ముంచీని
చెప్పగల సుద్ది రేయి చెప్పేఁ గాని

చ. 3:

బొమ్మల జంకించకురా పొరి నాకు చాలురా నీ
తమ్మ మోవి మోపకురా దప్పి దేరీని
చెమ్మగిలఁ గూడితివి శ్రీ వెంకటేశ నన్ను
సమ్మతించ నీగుణము చలి వాపేఁగాని