పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0261-2 కేదారగౌళ సం: 09-062

పల్లవి:

ఎరవె సతము చేసె నేఁటికొ కాని
తరుణిసింగార మిది తలపోయరే

చ. 1:

గరిమె మెరుఁగుఁబోఁడిగాన కొప్పు ఘనమాయ
విరులు ముడిచె యి దేవిధమొకాని
సరి సింహమధ్య భాగాన శైలకుచము లమరె
గరిమఁ బయ్యద నేల కప్పీనొ కాని

చ. 2:

కాంత చంద్రముఖిగాన కలువకన్ను లమరె
చెంతఁ జీఁకటిచూపేల చిమ్మీనొ కాని
బంతి వజ్రదంతి గాన పగడపుమో వమరె
పొంతఁ దమ్ములాన నేల పొదిపీనొకాని

చ. 3:

పసిఁడిపతిమగాన పదారుగళల మించె
యెఁసఁగెఁ దెల్లనినవ్వు లేడవొ కాని
కొసరి శ్రీ వెంకటేశుఁ గూడె నింతలోన నీకె
అసముదించని ఆస అది యెంతొకాని