పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0261-1 ముఖారి సం: 09-061

పల్లవి:

దూరలేను పోరలేను దొమ్మి దన్నుఁ జేయలేను
మోరతోపుఁదనముల మోనమెచాలు

చ. 1:

తత్తరించకురె పతి తానె నన్ను వలపించె
చిత్తము వచ్చినయట్టె సేయనీఁగదె
యెత్తి నది మీఁదు దనకె మేనుఁ బ్రాయమును
మొత్తమి నా కిఁకమీఁద మోనమెచాలు

చ. 2:

పిలువకురె మీరు పెండ్లాడె ననుఁ దొల్లె
వలసి నప్పుడు రానీ వరుసకును
పలికితిఁ దనదని ప్రాణమును మానమును
ములువాఁడి చెక్కుచేతి మోనమెచాలు

చ. 3:

కక్కసపెట్టకురె కమ్మరఁ విచ్చేసెఁ దానె
మక్కువ గలుగుపాటి మన్నించనీవె
అక్కున శ్రీ వెంకటేశుఁ డాదరించి నన్నుఁగూడె
మొక్కలాన నాకింక మోనమెచాలు