పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0260-5 శ్రీరాగం సం: 09-059

పల్లవి:

తగుఁ దగు నీకు నాకుఁ దలవయ్యా
తగవు లగవులాయఁ దమకించకువే

చ. 1:

మొఱఁగి కన్నుల నీకు మొక్కేమయ్యా వో
తెఱవ నేఁ గన్నులనె దీవించితినే
వెఱగంది మోవి నీకు విందు చెప్పేఁ బో నిన్ను
జఱసి నే గుక్కిళ్లఁ జివిగొంటిఁ బో

చ. 2:

పెలుచు నా కోరికలఁ బిలిచేనయ్యా నేనుఁ
బలుమారు నాలోనె పలికితినే
మెలఁగి ని న్నొకవేల మెచ్చేనయ్యా
నలువంక సెలవుల నవ్వితి నేను

చ. 3:

పెంపుడుఁగుచాల నిన్నుఁ బెద్దసేసేఁ బోనే
నింపుల రతుల ని న్నెచ్చరించేనే
గుంపెన శ్రీ వెంకటేశ కూడితిమయ్యా నిన్ను
దింపక నా వురమున దిష్టము మోచితివే