పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0260-4 ఆహిరి సం: 09-058

పల్లవి:

తరవాతి పనులెల్లఁ దగవాయఁగా
యెరవు సతము సేసీ నే మందునే

చ. 1:

కుప్పలుగాఁ దన్ను దూరి కోపగించె యందులోఁదా
తప్పు వట్టీ నిది లెస్స తగవాయఁగా
చెప్పనేల రాళ్లు చక్కఁజేసి మలిగండ్లేరీ
నిప్పు డిట్టె నే నిందు కేమందునే

చ. 2:

పూని తన్ను నేర మెంచి బుద్దిచెప్పె యందులోను
తానూ బుద్దులు చెప్పీ దగవాయఁ గా
ఆని కస్తూరి నల్ల నంటెఁ దెలుకపిండి
యీ నెపాన నల్లనంటె నేమందునే

చ. 3:

చెమరించీ తొలమని చేతనంటి తోయఁబోతె
తమకానఁ గాఁగిలించీఁ దగవాయఁగా
సమరతి నన్నుఁ గూడె సరి శ్రీ వెంకటపతి
యిమిడె సంతసముల నేమందమే