పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0260-2 రామక్రియ సం: 09-056

పల్లవి:

ఇంతట నిట్టె విచ్చేసి యింతిఁ గూడితేఁ గనక
వంతుకు నిన్ను జాణదేవర వనవచ్చును

చ. 1:

తనలోనె తలపోసి తప్పక చూచేవేళ
వనితను దేవగన్య యనవచ్చును
పనివి నిన్నుఁ దలఁచి పాటలు వాడేవేళ
అనుగు గంధర్వకాంత యనవచ్చును

చ. 2:

చలపట్టి విరహాన జలకేళి సేయువేళ
అలివేణి నాగకన్య యనవచ్చును
చలువకుఁ జంద్రకాంత శిలపైఁ బొరలువేళ
అలరిన చంద్రకన్య యనవచ్చును

చ. 3:

శ్రీ వెంకటేశ నీవు చెలియఁ గూడినవేళ
ఆవటించి నిజలక్ష్మీ యనవచ్చును
వోవల నీ సోమ్ములలో వురమున మోచువేళ
దేవి యలమేలుమంగ దిష్ట మనవచ్చును