పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0259-6 ఆహిరి సం: 09-054

పల్లవి:

ఏల జోలిఁ బెట్టేనే నిన్నిందాఁకాను
వోలి నీ కెదురు చూచు చున్నాఁడ నేను

చ. 1:

యేమిసేసీనె చెలి యింతి నీ వేఁగెటివేళ
యేమె నీరాక కెదు రేతెంచెనా
ఆమాటలెల్ల నీవు ఆకె కెఱిఁగించితివా
యేమని చెప్పమనెనె యెడమాట నాకు

చ. 2:

ఔనె నావుంగరము ఆకె వేల నున్నదా
మానిని నామేలు నీతో మది నెంచునా
తాను వచ్చే ననునో యీతరి నన్ను రమ్మనునో
పూని తన వ్రాలాకు పుత్తెంచెనా

చ. 3:

సతిమాఁట కింటివారు సమ్మతించి వుందురా
అతివ నీ మఱఁగున నది యెవ్వరె
యితవైన శ్రీ వెంకటేశుఁడ నైనందుకును
సతి నన్నుఁ గూడినదె సఫలము లాయ