పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0259-5 వరాళి సం: 09-053

పల్లవి:

ఏమౌత నెఱఁగ నీ వేమనేవె
నీ మన సొక్కటాయ నీవే నేనూ

చ. 1:

కొప్పు గడు వెడ జారె గుణము తేటలు దేరె
యిప్పుడు చెలియ నాతో నేమనేవె
రెప్పల ముత్యాలు గారె కప్పి చెక్కు చేయి చేరె
చెప్పిన బుద్దులు వింటిఁ జీఁకటె వెలుఁగు

చ. 2:

నిలువురాఁకలఁ గాఁగె నిట్టూర్పు గడు రేఁగె
యెలుఁగెత్తి నీవు నాతో నేమనేవె
వలపులు దల కెక్కె వాఁడి కుచముల కెక్కె
చెలియ నీ వూఁకొంటి చేవె చిగురు

చ. 3:

చెదరి పయ్యెదజారె సిగ్గులు సెలవిఁ గారె
యెదు రెదురనె చెలి యేమనేవె
యిదివొ శ్రీ వెంకటేశుఁ డిటువచ్చి నన్నుఁ గూడె
సదమదమైతి రతిచలమె ఫలము