పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0259-3 ముఖారి సం: 09-051

పల్లవి:

ఓపో ఆదేమోయి వో బావ యింక
వోపనంటేఁ బోవునటె వో వో మరఁదలా

చ. 1:

వొరసే వదేమోయి వో బావ నిన్ను
వొరసీఁ బో నీకుచాలె వో మరఁదల
వొరకు నెత్తుకు సరి వో బావ నీవె
వొర తొమ్మిది చాఁచేవో వో మరఁదలా

చ. 2:

వొగరులాడే వోయి వో బావ నీకు
వొగరు మోవిచిగురు వో మరఁదల
వొగరుఁ జిగురె చేఁగ వో బావ అదె
వొగిఁ బిసికితేఁ బసురో వో మరఁదలా

చ. 3:

వొంటి దగ్గరే వోయి వో బావ నాకు
నొంటి గాదు నీ వుండఁగ నో మరఁదల
గొంటవై శ్రీ వెంకటాద్రిఁ గూడితి బావ మన
కొంటి నేల ఆమాఁటలో వో మరఁదలా