పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0251-4 లలిత సం: 09-004

పల్లవి:

ఆపెనందునో నిన్ను నందునో యీచేఁతలకు
యేపున వూరెల్లా పొందు లింతగాఁ జేసితివి

చ. 1:

యిద్దర మేకతమాడె యీవేళ మనవద్ద
గుద్దిరాన నాపె వచ్చి కూచున్నది
దిద్దరాదా అప్పేమైనఁ దీసుకొంటేఁ గనక నీ
విద్దెస సతుల కస మింతగా నిచ్చితివి

చ. 2:

లోనికేఁగి నీవు నేను లోలత నవ్వుచుండఁగా
తానువచ్చి నీకుఁబాదము లొత్తీని
సేనగా నియ్యఁగరాదా జీఁతము చిక్కితేఁగన
యీ నెపాన మందెమేళ మింతగాఁ జేసితివి

చ. 3:

వోరిచి ముసుఁగు వెట్టు కొగి నిన్నుఁ గూడితేను
పేరున శ్రీవెంకటేశ పిలిచీ నాపె
యీరాదా ఆపె సొమ్ము లెత్తుక వచ్చితేఁగన
యీరీతి చనవు లిచ్చి యింతగాఁ బెంచితివి