పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0258-6 భౌళి రామక్రియ సం: 09-048

పల్లవి:

ఏమాట కేమాట యెంత కెంతరా
యీమాటె యాడవె నీ వింకా నొకమారు

చ. 1:

అంటఁగాక వున్నదాన నట్టెవుండరా
అంటెనె నీచూపులు న న్నంతక తొల్లె
అంటువాయఁ జెమట నీరాడవా నీవు చి
ట్టంటు నీచేఁతలు నామై నంటవలదా

చ. 2:

తలపట్టుతో నుందాన దగ్గరకురా నా
తలఁ పట్టె నీ మీఁదఁ దగు లాయనే
తలపోఁత పేరు నీమైఁ దలకొనదా
తలపడి మేను మేనుఁ దడఁబడవలదా

చ. 3:

కన్నుల నిద్దుర వచ్చీఁ గాఁగి లేలరానీ
కన్నుల సన్నలె కావా కందువ చెప్పె
నన్ను నిట్టె శ్రీవెంకటనాథ కూడితి
కన్నెరొ యిట్టి రతులఁ గరగించవలదా