పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0257-4 రామక్రియ సం: 09-040

పల్లవి:

నీవు బడలితివి నేనుఁ జూచి బడలితి
కావించి నన్ను మరి కలసేవు గాని

చ. 1:

చెదరెఁ గస్తూరిబొట్టు చేత దిద్దుకొనవయ్య
అదన నిట్టూర్పులు ఆఁపవయ్య
వదలె తురుముగొంత వడిఁ జక్కఁ బెట్టవయ్య
పదరి వెనక మాతో బాససేతు గాని

చ. 2:

కడుఁ బులకించె మేను కప్పవయ్య పచ్చడాన
జడిసీఁ జెమటలు విసరు కోవయ్య
చిడియుఁ గెంపులమోవి చేత మూసుకొనవయ్య
నిడివి నిజము మాతో నెరుపేవు గాని

చ. 3:

గందపుబేఁట్లు రాలీ కాఁగిలించుకొనవయ్య
విందుల పొందుల శ్రీవెంకటేశుఁడ
కందువ నాకూట మిది కడదంటా భ్రమసితి
పొందితి విప్పుడు యింకాఁ బొదిగేవు గాని