పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0257-2 దేసాళం సం: 09-038

పల్లవి:

ఏడ కేడ యెంచి చూచి యెఱఁగవటే
కూడునా కపటములు కూటము లెందైనను

చ. 1:

మోమువంపుఁ గోప మేడ ముసిముసి నవ్వు లేడ
యేమే యెండలు వెన్నెల లెనయునటే
దోమటి వొట్లివి యాడ తొంగిచూపు లివి యాడ
సామై నల్లవేఁడియునుఁ జలువయుఁ గూడునా

చ. 2:

అంటితేఁ బెనఁగు లేడ అందులోఁ గొంకు లేడ
జంటఁ గారములు దీపఁ జవు లౌనటే
బంటు బంటు పంత మేడ బాస లెచ్బరించ నేల
వొంటిఁ జీఁకటి వెలుఁగు వుండునా యెందైనను

చ. 3:

అవ్వలయి వుండ నేల అద్దములో సన్నలేల
దవ్వులుఁ జేరువ లొక తారుకాణటే
రవ్వల శ్రీవెంకటాద్రిరమణుఁడనె నిన్ను
యివ్వలఁ గూడితి నింక నెర వౌనటే