పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0257-1 హిజ్జిజి సం: 09-037

పల్లవి:

జలములఁ బాసిన జలజాప్తునిచే
జలజము నొగిలిన చందంబాయ

చ. 1:

చక్కని యీపతి సతిఁ బెడఁబాసిన
వెక్కసపు మనసే వేఁడాయ
చెక్కు చేతితోఁ జింత్తించిన నది
అక్కట మదనుని యడిదంబాయ

చ. 2:

రమణి పతికడకు రాక నిలిచినా
తమి నిట్టూర్పులు దగులాయ
తమకంబున సతి దలపోయంగా
భ్రమసి చూచురెప్పలు నొప్పాయ

చ. 3:

యింతలో నిద్దరి కెడ మాటాడఁగ
అంతట వీనుల కాసాయ
యింతయు శ్రీవెంకటేశ్వరుఁ గూడఁగ
యింతేసి యిందాఁక నేమేమో ఆయ