పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0256-6 మధ్యమావతి సం: 09-036

పల్లవి:

ఆయము లంటే యారచికత యిది
చాయల సన్నకు చలి యిఁక నేదయ్యా

చ. 1:

మూయక మూసిన ముత్యపుమొగడలు
మోయక మోచే మొదలేదే
పూయక పూచిన పున్నమవెన్నెల
పాయక కానే బయ లేదయ్యా

చ. 2:

పుట్టక పుట్టిన పొది జక్కవలవి
మెట్టక మెట్టే మేరేదే
పెట్టక పెట్టిన పెనుమేఘమునకుఁ
బట్టన చోటను బలు వేదయ్యా

చ. 3:

పారక పారిన బలుతీఁగెలకును
ఆరితేర నిఁక నరుదేదే
యీరీతి శ్రీవెంకటేశుఁడ నే నిన్నుఁ
గోరి కూడితిని కొద యేదయ్యా