పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0256-4 సాళంగం సం: 09-034

పల్లవి:

ఇంతుల నెంత దూరునో యింత కవుడె
యింతట రావమ్మ మెచ్చు నింత కపుడె

చ. 1:

యిదె వచ్చి నదెవచ్చి నింతి యని యాసాస
నెదురుచూచుఁ బతి వింత కపుడె
వెదవీడనితురుము విడువ ముడువఁ బట్టె
హృదయ మేమౌనో పతి కింత కపుడె

చ. 2:

పొంది యెవ్వరు ముందరఁ బొలసిన నీవె యని
యందు నిన్నె పేరుకొను నింత కపుడె
ముందు నీపయ్యదకొంగు మూయాఁదియ్యనె పట్టె
యెందరి నంపునో పై పై నింత కపుడె

చ. 3:

నిన్నుఁ దలఁచి తలఁచి నిద్దిరించి కలలోన
యెన్నఁగఁ గాఁగిటఁ గడు నింత కపుడె
పన్నిన శ్రీవెంకటేశుఁ బైకొని కూడితి విట్టె
యిన్నాళ్లిటులఁ గాదు యింత కపుడె