పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0256-3 కాంబోది సం: 09-033

పల్లవి:

ఆయ నాయఁ బోయఁ బోయ నల్లనాఁడె నీ
చాయల సన్నల పొందు చాలువయ్యా

చ. 1:

వెన్నెలలు వేఁడెనుచు విసరించుకొనె నాపై
కన్నుల నవ్వులు చల్లి కాఁక రేఁచేవు
పన్ని వురిసిన యందుపై నుడుకు చల్లినట్లు
యెన్న మాతో మేకు సేసేవిఁక నేలయ్యా

చ. 2:

పాయము వేఁగని యిట్టె బడలివుండె నాపై
నీ యడ మాట మూట లేల యేత్తేవు
చాయల వేయిటి మీఁద జవ్వాది కొమ్ము రీతి
ఆయములు సోకించే వవునయ్యా

చ. 3:

సరసాలు వాఁడెనుచు సారెకు మొక్కె ననుచు
మురిపెము గోరేల మోపే వయ్యా
గరిమ శ్రీ వెంకటేశ కరుణించి మెచ్చినట్టు
కరఁగి కూడితి నన్నుఁ గత లేలయ్యా