పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0256-2 సాళంగం సం: 09-032

పల్లవి:

నేఁ దన్నుఁ గైకోని నేర మిందేదే
యీదెఁ దనమంచ మెక్క నైతినా

చ. 1:

అలుకేదె జలుకేదె ఆకెయింటనుండ నన్ను
సొలసి చూచిన మారుచూడునా నేను
యెలమిఁ గోప మిందేటి దిద్దరు ముచ్చటలాడ
వెలినుండి యిన్నియును విననైతి నటవే

చ. 2:

కుచ్చితపున సణఁ గేదె గొణఁ గేది నాయందు
నచ్చుఁ దనమోవి చూచి నవ్వ నైతినా
కెచ్చురేఁగి కపటాలు గిపటాల కేది యెడ
రచ్చఁ దనసేఁత లెల్ల మెచ్చనైతినా

చ. 3:

వేస టేది వోస టేది వింతచెలి విడిపంచి
గోస నాసచేసి తన్నుఁ గూడనా నేను
లాసిన శ్రీవెంకటేశు లాగు లెల్లఁ గనుఁగొని
యీసడముదీర వుర మెక్క నైతినా