పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0256-1 ముఖారి సం: 09-031

పల్లవి:

ఇంక నేల ఆ సుద్దులు యేరా నీవు
కొంకుతా నేఁ గొసరితే కూళతనము రాదా

చ. 1:

కానరాదా నీ గుణాలు కడు నీ మైకాఁక లందె
మానక యప్పటినె మాటాడేఁ గాక
మోనపుగుట్టు విడిచి ముసిముసి నవ్వు నీపై
నానఁబెట్టి చల్లితేను నగుఁబాటు గాదా

చ. 2:

తెలియరాదా నీ మోహము తెల్లవారి వచ్చినందె
అలుగలేక నీచే విడె ముందితిఁ గాక
నిలువుకు నిలువున నీ మోహము చూచి నేను
బలిమి సేసి పెనఁగితేఁ బరువేయదా

చ. 3:

యిరవుగాదా నీపంతము యిప్పుడు నన్నుఁగూడినందె
పొరసి నిన్ను బట్టువలెఁ బొగడఁ గాక
అరిది శ్రీ వెంకటపతి ఆయము లంటితినిన్ను
యెరవుగా నిన్నేమనిన యెచ్చు కుందు గాదా