పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0255-6 వరాళి సం: 09-030

పల్లవి:

ఇంతటిది గావలదా యింతి యైతేను
కాంతునిఁ గళ లంటి కరఁగించె నిపుడు

చ. 1:

అలిగి వచ్చినపతి నలమి కాఁగిట నెత్తి
పలుకుల వినయాలు పచరించఁగా
సొలసి కోపాన నాఁటఁ జూచె విభుఁ డంతలోనె
చెలియ చెమట గోరఁ జిమ్మెఁబో కన్నులనూ

చ. 2:

మక్కువ మంకులతోడ మాటలాడకున్న పతి
చెక్కు నొక్కి జలజాక్షి సేద దేర్చఁగా
వెక్కసము లాడెటి విభుని వదనమున
పుక్కిటి తమ్ముల మిడి పొలిఁతి వాలించెనే

చ. 3:

పంతపు శ్రీవెంకటేశుఁ బడఁతి వొయ్యనె చేరి
అంతరంగ మెల్ల దేర్చి యాదరించఁగా
రంతుతో రతుల నిబ్బరము చూపె నాతఁడును
మంతనానఁ జొక్కించి మఱపించె మేనూ