పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0255-5 హిజ్జిజి సం: 09-029

పల్లవి:

ఘనుఁడవు తెగి కొరికఁగ నేల
ననిచిన కొలఁదుల నడపవు గాక

చ. 1:

చూచీఁ జూడని చూపులు నీకె
లోచూపై మదిలో నాటె
కాచిన మూకులు కమ్మరఁ దమకే
మోచిన కొలఁదుల మో పైనట్లూ

చ. 2:

ఆడియు నాడని అరమాటలె నీ
కాడనె చిరునగవై వెడలె
గాడపుటింటికి కట్టలు గట్టిన
వేడుక నలుగుల వెళ్లినయట్లూ

చ. 3:

చిందియుఁ జిందని సిగ్గులు నీకే
విందుల కాఁగిట వెగ టాయ
యిందునె శ్రీ వెంకటేశుఁడ నీ నా
గొందుల చెనకులు గుఱు తయినట్లా