పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0251-2 పాడి సం: 09-002

పల్లవి:

ఏమే నేవచ్చి యిప్పుడెంత దడ వాయనే
దీమసపుదానవు నేఁ దెమలించఁ గలనా

చ. 1:

నిక్కిచూచి నన్నాతఁడు నీవద్దికిఁ బెట్టిపంపె
యెక్కడ నున్నది చిత్తమే మంటివే
కక్కసించి యడిగితే కంట నీరు వెట్టేవు
యెక్కడ గెలవవచ్చు నిటువంటివారిని

చ. 2:

వాకిటఁ దా నిలుచుండి వడి నాతో సన్నసేసి
యీకడ నా కిఁక బుద్ధి యేమంటివే
పైకొని కొంగు వట్టితే బలిమి నుసు రనేవు
నీకు నీకే తెలుసునే నెరవాదితనము

చ. 3:

యిదిగో శ్రీవెంకటేశుఁ డెచ్చరింపించి నాచేత
యెదుటనె పెనగొనీ నే మనేవే
పొదిగి కలసెఁ దానె పూఁచి నీవు నవ్వేవు
ముదమునఁ బను లెల్ల ముందువెన కాయనే