పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0251-1 దేసాక్షి సం: 09-001

పల్లవి:

దగ్గరితె మొగచాటు దువ్వులు నుంటేఁ జవి
నిగ్గుల యీరెండూను నీవొళ్లనే కంటినే

చ. 1:

చెలియ పతిఁ గానక చింతతో నుండి ఆతఁడే
పిలువఁగా యిప్పుడైతే బిగిసేవే
కలయ నంటా దూరి గక్కనఁ జెయి వట్టితే
మొలకనవ్వులతోడ ములిగేవే

చ. 2:

అప్పుడైతే యెడమాట లాడించి నాయకుఁడు
తప్పక చూచితే నిట్టె తల వంచేవే
వుప్పతించి దూరఁగగానె వొద్దఁ గూచుండి నాతఁడు
పిప్పిగట్టే సిగ్గులతోఁ బెనఁగేవే

చ. 3:

చిత్తములోఁ గోరినట్టి శ్రీవెంకటేశ్వరుఁడు
అత్తి నిన్నుఁ గూడితేనె అలసేవే
పొత్తుల మోవితేనెతీపుల సోకించె నితఁడు
బత్తి సేయఁగా నీవు భ్రమసేవే