పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0300-4 సామంతం సం: 09-298

పల్లవి:

మాయింటికి విచ్చేసిన మన్నన యిది చాలదా
యేయెడనుండివచ్చిన నెరవుసే సేమా

చ. 1:

కప్పురపుఁ జూపులు ఆకాంత నీపైఁ జల్లఁగాను
వుప్పతిల్ల వెన్నెల నవ్వులు చల్లేవు
చప్పుడుసేయక యింకఁ జల్లఁగా బదుకరయ్య
యెప్పుడు నీవారమె నే మెరవుసేసేమా

చ. 2:

వేడుకమాటల నాపె విందునీకుఁ బెట్టఁగాను
యీడనె వలపుసొమ్ము లియ్యఁ జూచేవు
యీడుజోడుగూడుక మీరిద్దరు బదుకరయ్య
యేడసుద్ది మిమ్ము నేము యెరవుసేసేమా

చ. 3:

అలమేలుమంగ నీకు నాసలుగానుకియ్యఁగ
కలిమి శ్రీవెంకటేశ కప్ప మిచ్చేవు
మెలఁగి వొకరొకరు మీ రిట్టె బదుకరయ్య
యెలమి నన్నుఁ గూడితి వెరవుసేసేమా