పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0300-3 దేసాళం సం: 09-297

పల్లవి:

అంగమెల్లఁ జెమరించె నమ్మఁగారికి
అంగజరసములుబ్బీ నయ్యఁగారికి

చ. 1:

చెక్కునఁబెట్టిన చేయి సెలవి నవ్విన నవ్వు
అక్కజమై తోఁచీ నదె అమ్మఁగారికి
చిక్కని మోముకళలు చెయివట్టి పెనఁగేటి
అక్కరవేడుకనిండె నయ్యఁగారికి

చ. 2:

సరుస కంబముమాఁటు సమరతితోడు చూపు
అరుదుగఁ జిమ్మిరేఁగె నమ్మఁగారికి
తొరలనాడినమాట తొడమీఁదనింతిఁ బె ట్టి
అరమరపులు నిండె నయ్యఁగారికి

చ. 3:

మంచముపై సరసాలు మర్మముపై మంతనాలు
అంచుమోచె నెదుటనె అమ్మఁగారికి
కొంచక అలమేల్‌మంగఁ గూడినట్టి గురుతిదె
అంచ శ్రీవెంకటగిరి అయ్యఁగారికి