పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0299-2 దేసాళం సం: 09-290

పల్లవి:

ఎవ్వరింక సరినీకు నేమిటికిని
యివ్వలను నవ్వలను నిద్దరికె తగును

చ. 1:

చూపులనె భ్రమయించె సుదతి తనకెమ్మోవి
తీపులనె తేలించె దిష్టముగను
రూపుననె మరిగించి రుచులుగొనె నీవలపు
యీపనులు నేఁడు మీకిద్దరికె తగును

చ. 2:

ఆసలనెతమిరేఁచె నతివ దనచిరునవ్వు
మోసులనె మొలపించె మోహమెల్ల
బాసలనె నీచేతి పంతంబు దక్కఁగానె
యీసుద్దులెల్ల మీయిద్దరికె తగును

చ. 3:

అంకెలరతుల గెలిచె నలమేలుమంగ దన
లంకెలనుఁగూడి నిను లాలించెను
వుంకువలు శ్రీవెంకటోత్తముఁడ నీ కొసఁగె
యింకా నిట్ల మీకు నిద్దరికె తగును