పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/287

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0298-4 హిందోళవసంతం సం: 09-286

పల్లవి:

ఆతఁడు సేసేచేఁత కవిసరిదాఁకితేను
యీతల నే నిందరిలో నిది వెంగెమాడుటా

చ. 1:

దగ్గరి యాతనెదుట తలచిక్కు దీసుకొంటే
వెగ్గళించి నేఁ బతిని వెంగెమాడుటా
సిగ్గుతోడ సురటిని చెమట విసరుకొంటే
అగ్గలముగా నప్పటి నది వెంగెమాడుటా

చ. 2:

తఱి నితనియెదుట తమ్ముల ముమిసితేను
వెఱవక నే నిప్పుడు వెంగెమాడుటా
నెఱవుగ నామేని నీడలు చూచుకొంటే
అఱిముఱిఁ దనుఁ జూచి అది వెంగమాడుటా

చ. 3:

చిలుకనుఁ బేరుకొని శ్రీరామ రామ యంటే
వెలయఁగ నే నింతలో వెంగెమాడుటా
యెలమి శ్రీవెంకటేశుఁ డిందులకె నన్నుఁ గూడె
అలమి మోముచూచితే నది వెంగెమాడుటా