పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0298-3 పాడి సం: 09-285

పల్లవి:

ఇంకనేలరావయ్య యిద్దరము నిద్దరమే
సంకెదేఁరె బనులెల్ల రికి బేసాయను

చ. 1:

కన్నుల నే నవ్వితిని కాఁకలు పైఁ జల్లితిని
చన్నుల నొత్తితి నిన్ను సారె సారెకు
పన్ని నన్నుఁ దిట్టితివి పక్కన జంకించితివి
సన్నలఁ గొసరితివి సరికి బేసాయను

చ. 2:

మారుమాట లాడితిని మనసెల్ల సోదించితి
మేరమీరఁ జెనకితి మీఁద మీఁదను
తేరకొనఁ జూచితివి తెక్కులఁ జేకొంటివి
సారెఁ గొంగుదీసితివి సరికి బేసాయను

చ. 3:

లాగులెల్లఁ జూపితిని లంకెలతోఁ బెనఁగితి
చేగదేరఁ గూడితిని శ్రీవెంకటేశ
బాగుగా మన్నించితివి పంతమెల్లా నిచ్చితివి
సాగిన సబలలోన సరికి బేసాయను