పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0297-6 సామంతం సం: 09-282

పల్లవి:

ఏఁటికె యిందరూ నన్నియెరిఁగిన పనులకు
నాటకములు నాతోను నడపఁగవలెనా

చ. 1:

దవ్వులనున్న కోపము దగ్గరినప్పుడులేదు
యివ్వలనుండి విభుని నేల తిట్టేవె
చివ్వన నాతఁడువచ్చి చేయివట్టి తీసితేను
నవ్వకుండఁ గలవా నే నవ్వుదుఁ బో అపుడు

చ. 2:

ముంగిటఁ బెట్టిన వొట్టు మూలకుఁ బోతేలేదు
యింగితానఁ బతినేల యెత్తిపెట్టేవె
వుంగిటినాతఁడు నీతో నొడివట్టి పెనఁగితే
నంగవించవా నే ని న్నాడుదుఁ బో అపుడు

చ. 3:

కనుబొమ్మ యీజంకెలు కాఁగిటిలోనికిలేదు
యెనసె శ్రీవెంకటేశు నేల దూరేవె
ఘనుఁ డాతఁడిదె నిన్నుఁ గరఁగించి కొసరితే
చనవీకుందువా ని న్నెచ్చరింతుఁ బో అపుడు