పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0297-3 లలిత సం: 09-279

పల్లవి:

రంతుశాయ కిఁకరావయ్య
కొంత గొంత యిటుగూచుండవయ్యా

చ. 1:

ముచ్చటదీరక మోము చూచితే
అచ్చట లోఁగే వదేమయ్యా
చెచ్చెర నీమీఁదఁ జేయని కోపము
కొచ్చెటు గడించుకోనేలయ్యా

చ. 2:

చనవున నేఁ జేయి చాఁచిన యపుడే
అనయముఁ బెనఁగే వదేమయ్యా
తనియుచు నాలోఁ దలఁచని తలఁపులు
నినుపున నూహించ నీ కేలయ్యా

చ. 3:

తమకంబున నే దగ్గరి కొసరఁగ
భ్రమసిన మాఁటల పనేలయ్యా
అమరఁగ శ్రీవెంకటాధిప కూడితి
చెమరించితివిఁక చింతేలయ్యా